హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!
- October 08, 2026
కువైట్ : నివాస నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు భవనాలకు కువైట్ మున్సిపాలిటీ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. రాజధాని గవర్నరేట్ పరిధిలోని ఇంజినీరింగ్ ఆడిట్ అండ్ ఫాలో-అప్ విభాగం సంబంధిత అధికారులతో కలిసి చేపట్టిన తనిఖీల్లో ఈ చర్యలు తీసుకున్నారు.
దోహా, సులైబిఖాత్ ప్రాంతాల్లో బ్యాచిలర్ల నివాసాలకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాలుగు భవనాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా.. మరో రెండు ఉల్లంఘనలను సరిచేశారు. అలాగే తొమ్మిది హెచ్చరికలు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లు గతంలో గుర్తించిన భవనాలను మున్సిపాలిటీ ప్రత్యేక తనిఖీ బృందం పరిశీలించింది. నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా సంబంధిత భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.బ్యాచిలర్ల వసతి, నివాస భవనాలకు సంబంధించిన మున్సిపల్ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







