కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్‌లైన్‌లోనే..!!
- October 08, 2026
కువైట్ : కార్మిక చట్టాల ఉల్లంఘనలను అరికట్టేందుకు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) కీలక చర్యలు చేపట్టింది. ఇకపై సాహిల్ (Sahl) యాప్‌లోని “రిపోర్ట్ మీ (Report Me)” సేవ ద్వారా 8 రకాల కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఎలక్ట్రానిక్‌గా ఫిర్యాదు చేయవచ్చు. కార్మికుల హక్కులను పరిరక్షించడంతో పాటు, కార్మిక మార్కెట్‌లో అక్రమ కార్యకలాపాలను నియంత్రించడం, చట్టాల అమలుపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం ఈ సేవ ప్రధాన ఉద్దేశం.
Sahl యాప్ ద్వారా కింది ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు:
1. తిరిగి వచ్చిన లేదా గతంలో రిక్రూట్ చేసిన గృహ కార్మికులతో వ్యవహరించే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు.
2. రసీదు లేదా ఒప్పందం లేకుండా అదనపు రిక్రూట్‌మెంట్ ఫీజులు వసూలు చేయడం.
3. సరైన డాక్యుమెంట్లు లేని కార్మికులను ఉద్యోగాల్లో నియమించడం.
4. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించడం.
5. హింసకు సంబంధించిన మానవ హక్కుల ఉల్లంఘనలు.
6. వారి లింగానికి అనుమతించని కార్యకలాపాల్లో కార్మికులను పనిచేయించడం.
7. 18 ఏళ్లలోపు వారిని ఉద్యోగాల్లో నియమించడం.
8. సమ్మర్ మిడే వర్క్ బ్యాన్ సమయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్మికులతో పని చేయించడం.
ఫిర్యాదు ఎలా చేయాలి?
Sahl యాప్‌లో “Report Me” సేవను ఎంచుకుని, ముందుగా ఉల్లంఘన రకాన్ని ఎంపిక చేయాలి. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసి, ఉల్లంఘన జరిగిన ప్రదేశాన్ని పేర్కొనాలి. అవసరమైతే ఫిర్యాదుకు ఆధారంగా ఫొటోలను కూడా జత చేయవచ్చు. ఫిర్యాదును ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత వినియోగదారుడికి రిపోర్ట్ నంబర్‌తో కూడిన నోటిఫికేషన్ వస్తుంది. ఈ నంబర్ ద్వారా సంబంధిత అధికారులు కేసును పరిశీలించే ప్రక్రియను ఫాలోఅప్ చేయవచ్చు. ఈ కొత్త సేవతో కార్మిక చట్టాల ఉల్లంఘనలను సులభంగా అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు, కువైట్‌లో కార్మికుల హక్కుల పరిరక్షణ మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్‌లైన్‌లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







