రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- October 12, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన వారినిఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వారికి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. వైద్య బృందాలతో మాట్లాడిన మంత్రి.. బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఉమ్రా యాత్ర కోసం జెడ్డాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఓ ఒమానీ వైద్యుడు కూడా ఉన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సేవలు, నిరంతర పర్యవేక్షణ అందిస్తామని మంత్రి తెలిపారు. సౌదీ నాయకత్వం ఆదేశాల మేరకు బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య వ్యవస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
12 మంది మృతి.. 309 మందికి గాయాలు
సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానాశ్రయంపై జరిగిన దాడిలో 12 మంది మరణించగా, మరో 309 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు కాగా, ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. వారిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
భారతీయుడు మృతి.. 10 మందికి గాయాలు
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన భారతీయుల్లో ఒకరు మృతి చెందినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 10 మంది భారతీయులు గాయపడినట్లు తెలిపింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయబార కార్యాలయం.. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వెల్లడించింది. గాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చినప్పుడు వెల్లడిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







