అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- October 12, 2026
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలోని అల్ ధఫ్రా ప్రాంతంలో ఓ వేర్ హౌజ్ లో చెలరేగిన అగ్నిప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అబుదాబి పోలీసులు వెల్లడించారు. వేర్ హౌజ్లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో అబుదాబి సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తీవ్రంగా వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి ప్రజలు సరైన సమాచారం, తాజా వివరాల కోసం అధికారిక వనరులను మాత్రమే అనుసరించాలని అబుదాబి పోలీసులు సూచించారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 30న అబుదాబిలోని అల్ వత్వా ప్రాంతంలో వ్యర్థాల సేకరణ కేంద్రం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ ఘటనలోనూ అబుదాబి పోలీసులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే, సెప్టెంబర్ 3న అల్ మఫ్రాక్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం జరగగా, అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







