ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- October 12, 2026
దోహా: ఖతార్‌లోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కీలక నిర్ణయం తీసుకుంది. తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్ ద్వారా అందించే సేవల ఫీజుల చెల్లింపునకు Apple Pay, Google Pay సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త చెల్లింపు విధానాల ద్వారా వినియోగదారులు తమ సేవల ఫీజులను మరింత వేగంగా, సులభంగా చెల్లించవచ్చని వెల్లడించింది.
ఇప్పటికే మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ అప్లికేషన్లో ఈ చెల్లింపు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహించే వారికి మరిన్ని చెల్లింపు ఎంపికలు లభించనున్నాయి. డిజిటల్ సేవల వినియోగాన్ని సులభతరం చేయడం, చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులను తగ్గించడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







