రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- October 12, 2026
రియాద్: ఉద్యోగరిత్యా హైదరాబాద్‌కు చెందిన యూసుఫ్ సౌదీలో ఉంటున్నారు. భార్యాపిల్లల్ని చూసేందుకు ఈ నెల ఇంటికి వచ్చారు. మదినాను దర్శించుకోవాలనే ఉద్దేశంతో యూసుఫ్ కుటుంబ సభ్యులను తీసుకుని సౌదీకి వెళ్లారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఎప్పుడైతే వీరు మదినాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారో అప్పుడే అంతా తారుమారయ్యింది. విమానాశ్రయంలో ఆకస్మిక మిస్సైల్ దాడి జరిగింది. దాంట్లో యూసుఫ్‌తోపాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఘటనలో యూసుఫ్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. యూసుఫ్ మృతి పట్ల ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపినట్టు ఓవైసీ పేర్కొన్నారు. ఈ మేరకు అసదుద్దీన్ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







