శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం

- October 12, 2026 , by Maagulf
శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం

శ్రీనగర్: లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షతన సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, దాని పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ (NMDC) అధికారులతో సమావేశం జరిగింది.

సమావేశానికి ముందు ఎన్‌ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, ఎన్‌ఎండీసీకి సంబంధించిన అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా బాలశౌరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com