ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- October 13, 2026
దోహా: ఖతార్‌లో గురువారం వరకు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక తీర ప్రాంతాల్లో పొగమంచు తరహా వాతావరణం ఉండవచ్చని, పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఆకాశం కొంతమేర మేఘావృతమై ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
గాలులు నైరుతి, వాయువ్య దిశల నుంచి వీచి, ఆ తర్వాత ఈశాన్య, ఆగ్నేయ దిశలకు మారే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 05–15 నాట్స్గా ఉండనుండగా, ఉరుములతో కూడిన వర్షాల సమయంలో గంటకు 25 నాట్స్ వరకు ఈదురుగాలులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
సముద్రంలో ప్రధానంగా ఈశాన్య, ఆగ్నేయ దిశల నుంచి గంటకు 02–10 నాట్స్ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్ర అలల ఎత్తు తీర ప్రాంతాల్లో 1–2 అడుగులు, తీరానికి దూరంగా 1–3 అడుగుల వరకు ఉండవచ్చని అంచనా వేసింది.
అదే సమయంలో విజిబిలిటీ 4–9 కిలోమీటర్లు, సముద్ర ప్రాంతాల్లో 4–8 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







