కువైట్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!

- October 13, 2026 , by Maagulf
కువైట్‌లో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!

కువైట్ : కువైట్‌లోని సబాహ్ అల్ సలేం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ నివాస భవనంలోని అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఊపిరాడక ఇబ్బందులకు గురైనట్లు అధికారులు తెలిపారు.

కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మిష్రెఫ్, అల్ ఖురైన్ అగ్నిమాపక కేంద్రాలకు చెందిన సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఊపిరాడక ఇబ్బందులకు గురైన ఇద్దరినీ సంబంధిత అధికారులకు అప్పగించారు. వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు వెల్లడికాలేదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com