ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- October 14, 2026
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో వైశాలి జిల్లాలోని రఘెపూర్ దియారా ప్రాంతంలో, రాంపూర్ శ్యామ్చంద్ గ్రామం సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
గంగానది అవతల గ్రామంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని పడవపై తిరిగి తమ ప్రాంతానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నది మధ్యలోకిరాగానే పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ సమయంలో పడవలో 15 నుంచి 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 14మంది మరణించగా.. వీరిలో ఎక్కువ మంది 15ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు వైశాలి జిల్లా మెజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్లో ‘ఇత్కాన్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







