జిలీబ్లో ఫేక్ డొమెస్టిక్ హెల్ప్ ఆఫీస్
- August 25, 2016
బోగస్ డొమెస్టిక్ హెల్ప్ ఆఫీస్ని జిలీబ్ అల్ షుయియుఖ్లో రెసిడెన్సీ డిటెక్టివ్స్ కనుగొన్నారు. దీన్ని నిర్వహిస్తోన్న పలువురు వలసదారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకోగానే, ఆ సమాచారం సరైనదేనని నిర్ధారించుకున్న అధికారులు, వ్యూహాత్మకంగా ఆ ఆఫీస్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయినవారిలో ఐదుగురు ఇథియోపియన్లు, ఐదుగురు కెమెరూనియన్స్, ముగ్గురు ఘనైయాన్స్, ముగ్గురు బెనైనెన్స్ఉన్నారు. వీరెవరికీ గుర్తింపు కార్డులు లేవు. మరో ఆరుగురు వారి స్పాన్సర్స్ నుంచి తప్పించుకు తిరుగుతున్నవారినీ గుర్తించారు. రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటామనీ, ఆ పనులు లేనప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటామని నిందితులు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







