గ్యాస్ పేలుడులో బామ్మ మృతి... 3 నెలల పసిపాప క్షేమం
- August 25, 2016
దుబాయ్: స్థానిక అల్ ఖైల్ గేట్ ప్రాంతంలో బుధవారం ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 63 ఏళ్ళ షిరిన్ గాంధీ గురువారం ఉదయం రషీద్ హాస్పిటల్ ఐ సి యు వద్ద ఆమె తుది శ్వాస విడిచారని ఒక కుటుంబ సభ్యుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు..గాయాల పాలైన మరో బాధితురాలి భర్త హుస్సేన్ లక్డావాలా మాట్లాడుతూ ,బుధవారం ఉదయం 9.20 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగినట్లు పేర్కొన్నారు "నా అత్తగారు ఈ ప్రమాదంలో 60 శాతం కాలిన గాయాలతో ప్రాణం విడిచారు . రెండవ బాధితురాలు అయిన తన భార్య 50 శాతం గాయాలతో చావుబతుకుల మధ్య రషీద్ హాస్పిటల్ ఐ సి యు లో పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.తన భార్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది మరియు ఆమె స్పృహలో ఉందని ఆమె తిరిగి కోలుకుంటుందని మేము విశ్వసిస్తున్నట్లు 'లక్డావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ చెక్కుచెదరకుండా కనుగొనబడింది. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం ఏర్పడి ఉండవచ్చుని భావిస్తున్నారు.అల్ ఖైల్ గేట్ ఫ్లాట్ లోపలి భాగం పూర్తిగా పగుళ్లు బారి ధ్యంసం కాబడింది. లక్డావాలా మాట్లాడుతూ , ఈ ప్రమాద సమయంలో తమ మూడు నెలల వయస్సు ఉన్నకుమార్తె, జరా ఆమె తల్లి తో ఉందని ఒక అద్భుతమైన రీతిలో చిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.నా ముద్దుల కూతురు జరా, ప్రస్తుతం లాటీఫా హాస్పిటల్ లో దేవుని దయ ద్వారా సురక్షితమైన పరిస్థితిలో ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







