వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!

- October 15, 2026 , by Maagulf
వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!

దోహా: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తమ ఇళ్లు, భవనాలు, ఇతర సౌకర్యాల పరిరక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సూచించింది. వర్షాల కారణంగా నీటి లీకేజీలు, వరదలు, ఆస్తి నష్టం సంభవించకుండా ముందుగానే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కోరింది.ఈ మేరకు అష్ఘల్ సోషల్ మీడియా వేదికగా పలు సూచనలు విడుదల చేసింది.

ఇళ్లలోని గాజు పైకప్పులు, కిటికీల చుట్టూ ఉన్న సీలింగ్ సరిగా ఉందో లేదో తనిఖీ చేయాలని సూచించింది. అలాగే ఇళ్ల సమీపంలోని డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయాలని, పైకప్పుల వాటర్‌ప్రూఫ్ ఇన్సులేషన్‌ను పరిశీలించాలని పేర్కొంది.వర్షపు నీరు సజావుగా బయటకు వెళ్లేలా గట్టర్లు, నీటి పారుదల మార్గాలను తనిఖీ చేయాలని, ఎక్కడైనా లీకేజీలు లేదా అడ్డంకులు ఉంటే వెంటనే సరిచేయాలని అష్ఘల్ సూచించింది.
వర్షాలు ప్రారంభమయ్యే ముందే నిర్వహణ పనులను పూర్తి చేసుకోవడం ద్వారా నీటి వల్ల కలిగే నష్టాలను తగ్గించడంతో పాటు ప్రజల భద్రతను పెంపొందించవచ్చని అధికారులు తెలిపారు. ఖతార్‌లోని పౌరులు, నివాసితులు ఈ సూచనలు పాటించి వర్షాకాలానికి సిద్ధంగా ఉండాలని అష్ఘల్ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com