యూఏఈలో ఎన్టీయార్ 'గ్యారేజ్' రికార్డ్
- August 25, 2016
ఎన్టీయార్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని యూఏఈలో రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. మొత్తం 48 లొకేషన్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. గల్ఫ్ దేశాల్లో ఇదే ఏ తెలుగు చిత్రానికైనా రికార్డ్. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నిత్యామీనన్, సమంత ఈ చిత్రంలో ఎన్టీయార్ సరసన హీరోయిన్లుగా నటించగా, ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







