విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

- October 15, 2026 , by Maagulf
విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

విజయవాడ: విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం నగరానికి విచ్చేసిన రాష్ట్రపతి.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలతో పాటు పవిత్ర చిత్రపటాన్ని ఆలయ కమిటీ ఘనంగా బహూకరించింది.

సరస్ మేళా ప్రారంభం.. డిజిటల్ పేమెంట్‌తో చీర కొనుగోలు
పర్యటనలో భాగంగా గురువారం నగరంలో ‘జాతీయ సరస్ మేళా’ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత ఆవశ్యకతను ఆమె గుర్తుచేశారు. మహిళలే కుటుంబాలకు మూలస్తంభాలని, నేడు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ స్వయంగా ఉపాధి కల్పించుకుంటుండటం ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. ఈ మేళాలో భాగంగా ఓ స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి.. స్వయంగా డిజిటల్ పేమెంట్ (UPI) చేసి ఒక చీరను కొనుగోలు చేయడం విశేషం. అనంతరం అక్కడే స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో కలిసి ఆప్యాయంగా భోజనం చేశారు.

ఘన వీడ్కోలు పలికిన హోంమంత్రి అనిత
సరస్ మేళా కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండియన్ డిఫెన్స్‌కు చెందిన స్పెషల్ ఫ్లైట్‌లో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత ఘన వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com