అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!

- October 15, 2026 , by Maagulf
అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ నెల 24న ఒక భారీ నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మరియు ఎన్నికల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘం తీరును ఎనిగగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.

రాహుల్ గాంధీ మరియు ‘ఇండియా’ కూటమి నేతల రాక

ఈ ప్రతిష్టాత్మక నిరసన కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ‘ఇండియా’ (INDIA) కూటమికి చెందిన పలువురు ప్రముఖ జాతీయ నేతలు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిని తప్పుబడుతూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ నిరసన కార్యక్రమం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com