ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- October 16, 2026
దోహా: ఖతార్‌లో ఉద్యోగుల నివాస అనుమతి (రెసిడెన్స్ పర్మిట్) జారీ లేదా రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వారి పాస్‌పోర్టులను తిరిగి ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకునే యజమానులకు QR25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) అధికారి హెచ్చరించారు. మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెబ్‌నార్‌లో సెర్చ్ అండ్ ఫాలో-అప్ విభాగంలోని డిటెన్షన్ సెక్షన్ అధిపతి మేజర్ సౌద్ హమద్ అల్బురైదీ ఈ విషయాన్ని వెల్లడించారు.
రెసిడెన్స్ పర్మిట్ జారీ లేదా రెన్యువల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే యజమానులు ఉద్యోగుల పాస్‌పోర్టులను వారికి తిరిగి ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే, పాస్‌పోర్టును యజమాని వద్దే ఉంచుకునేందుకు ఇరు పక్షాల మధ్య ఒప్పందం లేదా చట్టబద్ధమైన పత్రం ఉన్న సందర్భాల్లో నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఉద్యోగులకు పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వకపోవడం చట్టపరమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యజమానులు ఉద్యోగుల పత్రాలను వారికి అప్పగించాలని సూచించింది.
ఉద్యోగ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు, తమ పాస్‌పోర్టులను యజమానులు తిరిగి ఇవ్వకపోతే బాధిత ఉద్యోగులు కూడా సంబంధిత అధికారులను ఆశ్రయించి సహాయం పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!







