సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!

- October 16, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కంపెనీలకు చెందిన 3,108 కార్లను రికాల్ చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2025 మోడల్ వాహనాల్లో ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (EGR) వాల్వ్‌లో లోపం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రాబ్లమ్ కారణంగా వాహనాల వేగం పెరిగే సామర్థ్యం తగ్గిపోవచ్చని, డ్రైవింగ్ సమయంలో ఇంజిన్ శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది.

 ఏయే కార్లను వెనక్కి పిలుస్తున్నారు?

ఈ రీకాల్ పరిధిలో 2025 మోడల్‌కు చెందిన కింది వాహనాలు ఉన్నాయి.

- ఫోర్డ్ ఎక్స్‌ప్లోరర్ (Ford Explorer)

- ఫోర్డ్ టారస్ (Ford Taurus)

- లింకన్ నాటిలస్ (Lincoln Nautilus)

- లింకన్ కోర్సెయిర్ (Lincoln Corsair)

ఉచితంగా మరమ్మతులు

రీకాల్ పరిధిలోకి వచ్చే వాహనాల యజమానులు సంబంధిత స్థానిక డీలర్లను సంప్రదించి అవసరమైన మరమ్మతులు ఉచితంగా చేయించుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

సంప్రదించాల్సిన డీలర్లు, ఫోన్ నంబర్లు:

- అల్ జజీరా వెహికల్స్ ఏజెన్సీస్ కంపెనీ: 8007492222

- మొహమ్మద్ యూసుఫ్ నగీ మోటార్స్ కంపెనీ: 8001240218

వాహనాల్లోని లోపాన్ని సకాలంలో సరిచేయించుకోవడం ద్వారా డ్రైవింగ్ సమయంలో తలెత్తే ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచించారు. సౌదీ అరేబియాలో ఈ నాలుగు మోడళ్ల కార్లను వినియోగిస్తున్నవారు తమ వాహనం రీకాల్ పరిధిలోకి వస్తుందో లేదో సంబంధిత డీలర్లను సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com