బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- October 18, 2026
మనామా: నివాస ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధీనంలోని 88 స్థలాలను పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుకు కేటాయించింది. రహదారుల అభివృద్ధి పనుల ద్వారా ఇప్పటికే 2,500కు పైగా పబ్లిక్ పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్కింగ్ సౌకర్యాల కోసం కేటాయించిన 88 స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, యాజమాన్య పత్రాల జారీ పూర్తయినట్లు ప్రభుత్వం ప్రతినిధుల సభ ఆమోదించిన ప్రతిపాదనకు ఇచ్చిన సమాధానంలో వెల్లడించింది.
మనామా, జనాబియా, అవాలి, అబు సైబా, సమాహీజ్ ప్రాంతాల్లోని స్థలాలను పార్కింగ్ సౌకర్యాల కోసం కేటాయించారు. ముహర్రక్ నగర అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మరిన్ని పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.వాహనాల సంఖ్య పెరగడం, జనాభా వృద్ధి కారణంగా నివాస ప్రాంతాల్లో పార్కింగ్ కొరత తీవ్రంగా మారుతోందని ఎంపీ బస్మా అబ్దుల్ కరీమ్ ముబారక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యతో పొరుగువారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని, భద్రతా అధికారులకు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఖాళీ స్థలాలను బహుళ అంతస్తుల పార్కింగ్ కేంద్రాలుగా మార్చాలని ఆమె ప్రతిపాదించారు.
అయితే, పాత నివాస ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండటం, స్థలం పరిమితంగా ఉండటం వల్ల బహుళ అంతస్తుల పార్కింగ్ కేంద్రాల నిర్మాణంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి కేంద్రాలకు ర్యాంపులు, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాల కోసం తగినంత స్థలం అవసరమని, వీటి నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.అందుబాటులో ఉన్న భూమి, ట్రాఫిక్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అనువైన ప్రాంతాల్లో అదనపు పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై అధ్యయనం కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







