మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!

- October 20, 2026 , by Maagulf
మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!

కువైట్: మిస్ కేరళ 2026 అందాల పోటీల్లో కువైట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న భారతీయ యువతి కాజల్ లిబి ద్వితీయ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆమె తన ప్రతిభను చాటుకోవడంతో పాటు కువైట్‌లోని భారతీయ ప్రవాస సమాజానికి గర్వకారణంగా నిలిచారు. కేరళలోని కాయంకుళం సమీపంలోని ఓచిరాకు చెందిన కాజల్ లిబి కువైట్‌లో పెరిగారు. ప్రస్తుతం కువైట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

టెక్నాలజీ, ఏఐ, మహిళా సాధికారతపై ప్రత్యేక ఆసక్తి కలిగిన కాజల్.. మహిళలు తమకు నచ్చిన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ అంచనాలకు పరిమితం కాకుండా, తమ ప్రత్యేకతను చాటుకుంటూ వ్యక్తిగత లక్ష్యాలను సాధించే దిశగా మహిళలు ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.
కాజల్ తండ్రి శ్రీలాల్ లక్ష్మణన్ కువైట్‌లోని ఏబీజే ఇంజినీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి లిబి శ్రీలాల్ మహబూలాలో మరాహెబ్ స్టైల్ లేడీస్ సెలూన్ నిర్వహిస్తున్నారు. కాజల్ సాధించిన ఈ విజయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు కువైట్‌లోని భారతీయ ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com