డైరెక్టర్ తో డైరెక్ట్ గానే బాంబు బెదిరింపులు..
- August 25, 2016
ఒక సినిమా డైరెక్టర్ ఇంటిపై బాంబులు వేసి పేల్చేస్తామని బెదిరింపుడు వస్తున్నాయి.ఆ డైరెక్టర్ తో డైరెక్ట్ గానే అటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్ట్ ఇంటిపై బాంబు దాడి చేయాల్సినంత అవసరం ఏముంటుంది. ఆ బెదిరింపులతో హడలెత్తిన ఆ డైరెక్టర్ పోలీసులను కూడా ఆశ్రయించాడు.
సినిమా వాళ్ళకు రౌడీ షీటర్లతో,ఉగ్రవాదులతో బెడదలు తప్పడంలేదు.కొంత డబ్బు,పవర్ సంపాదించగానే సెలెబ్రెటీలను టార్గెట్ చేసి పాపులారిటీని సంపాదిస్తారు.అయితే ప్రస్తుతం డైరెక్టర్ పై బాంబు దాడులు చేస్తామంటుంది రౌడీ షీటర్లో,ఉగ్రవాదులో కాదు సింగం డైరెక్టర్ హరి ఇంటిపక్కనే ఉండే నైబర్స్.
తాజా సమాచారం ప్రకారం పార్కింగ్ విషయంలో డైరెక్టర్ తో ప్రక్కింటి వారికి గొడవ కావడంతో ప్రక్కింట్లో ఉండే కార్తిక్ , కుప్పు స్వామి అనే వాళ్లు ఆయన్ని బాంబులు వేసి మీ ఇంటిని పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారట.
దాంతో హరి చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ కు వెళ్లి అఫీషియల్ గా వారిపై కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీస్ లు సెక్షన్ 75 క్రింద, న్యూసెన్స్ కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







