సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- October 22, 2026
రియాద్: సౌదీ అరేబియాలో నిర్మాణ వ్యయాలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ నెలలో, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2.2 శాతం పెరిగాయి. నివాస మరియు నివాసేతర నిర్మాణ రంగాల్లో వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) పేర్కొంది.
GASTAT విడుదల చేసిన 'కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఇండెక్స్' (CCI) నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2025తో పోలిస్తే సెప్టెంబర్ 2026లో నివాసేతర నిర్మాణ వ్యయాలు 2.6 శాతం, నివాస నిర్మాణ వ్యయాలు 2.1 శాతం పెరిగాయి. నివాస నిర్మాణ రంగంలో, ప్రాథమిక నిర్మాణ సామగ్రి ధరలు 1.7 శాతం పెరగడం వల్ల మొత్తం వ్యయం పెరిగింది; ఇందులో కలప మరియు జాయినరీ ధరలు 3.5 శాతం పెరిగింది. ఇక పరికరాలు మరియు యంత్రాల అద్దె వ్యయాలు 4.1 శాతం పెరిగాయి. కార్మిక వ్యయాలు 1.5 శాతం, ఇంధన (శక్తి) వ్యయాలు 3 శాతం పెరిగాయి.
అదే సమయంలో నివాసేతర నిర్మాణ రంగంలో, ప్రధాన వ్యయ అంశాలలో పరికరాలు మరియు యంత్రాల అద్దె అత్యధికంగా 5.8 శాతం పెరిగింది. ఇందులో ఆపరేటర్‌తో కూడిన పరికరాలు మరియు యంత్రాల అద్దె ధరలు 7.2 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. కార్మిక వ్యయాలు 2 శాతం, ఇంధన వ్యయాలు 3 శాతం పెరిగాయి. నివాసేతర నిర్మాణ రంగంలో ప్రాథమిక నిర్మాణ సామగ్రి వ్యయాలు 1.8 శాతం పెరిగాయి. ఇందులో ఇతర నిర్మాణ సామగ్రి ధరలు 4.3 శాతం, కలప మరియు జాయినరీ ధరలు 2.1 శాతం పెరగడం ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. పాయి.
GASTAT ప్రకారం.. కాంట్రాక్టర్ల కార్యాలయాలు, ఇంజనీరింగ్ కార్యాలయాలు మరియు నిర్మాణ సామగ్రి విక్రయ సంస్థలకు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా 13 ప్రాంతాల నుండి నెలవారీగా డేటాను సేకరించి, ఈ సూచిక 51 నిర్మాణ రంగ ముడిసరుకుల ధరల మార్పులను పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- ఖతార్ లో అత్యవసర ప్రతిస్పందన బలోపేతం..!!
- మార్చి 24న మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2027..!!
- వాహనం ఢీకొని 23 ఏళ్ల మోటార్‌సైకిలిస్ట్ మృతి..!!
- దుబాయ్‌లోని పామ్ జుమేరా వద్ద కొత్త 'వ్యూ' పాయింట్..!!
- దుబాయ్‌లో రెండు నెలల చిన్నారికి గుండె శస్త్రచికిత్స.. Dh146,515 వైద్య ఖర్చులు!
- సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునఃప్రారంభం
- నాంపల్లి గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’ వేడుకలు ప్రారంభం
- దుబాయ్‌లో ఘనంగా AES అచీవర్స్ సమ్మిట్ & ఆనర్స్ 2026







