ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!
- October 23, 2026
దోహా: ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్–అమెరికా మధ్య సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
అలాగే, ప్రాంతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపడుతున్న దౌత్య ప్రయత్నాలు, పరస్పర సమన్వయం, ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ మాట్లాడుతూ.. సముద్ర మార్గాల్లో నౌకాయాన స్వేచ్ఛను కాపాడే పరిష్కారం సాధించేందుకు జరుగుతున్న అన్ని దౌత్య ప్రయత్నాలకు ఖతార్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతిని నెలకొల్పే సమగ్ర ఒప్పందానికి మార్గం సుగమం కావాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- యాస్ ఐలాండ్లో మరోసారి IIFA సందడి.. 2027 జనవరి 22, 23 తేదీల్లో వేడుకలు!
- కువైట్లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!
- సౌదీ అరేబియాలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!







