భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- October 23, 2026
మనామా: బహ్రెయిన్‌లో తమిళ సమాజ సంక్షేమం కోసం పనిచేస్తున్న భారతి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు.. బహ్రెయిన్‌లో భారత నూతన రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్‌ను భారత రాయబార కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సంప్రదాయ శాలువా, పుష్పగుచ్ఛంతో రాయబారికి స్వాగతం పలికి, నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇక భేటీ సందర్భంగా బహ్రెయిన్ నాయకత్వం, ఆ దేశంలో నివసిస్తున్న తమిళుల జీవన పరిస్థితులు, భారతీయ సమాజం పట్ల బహ్రెయిన్ ప్రభుత్వం చూపుతున్న గౌరవం, ఆదరణపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తమిళులతో పాటు బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఇతర భారతీయుల సంక్షేమం, ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అనంతరం భారతి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖయ్యూం మాట్లాడుతూ..ఈ సమావేశం సంతోషకరంగా, సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. రాయబారిని కలిసి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు పేర్కొన్నారు.
భారతి అసోసియేషన్ తరఫున షేక్ బషీర్ అహ్మద్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. భారత్–బహ్రెయిన్ మధ్య చిరకాల స్నేహం, బలమైన ద్వైపాక్షిక సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డెలివరీ బైక్‌లపై కువైట్‌లో ట్రాఫిక్ శాఖ కొరడా..!!
- భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్‌లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..
- కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి
- యాస్ ఐలాండ్‌లో మరోసారి IIFA సందడి.. 2027 జనవరి 22, 23 తేదీల్లో వేడుకలు!
- కువైట్‌లో కంపెనీలకు షాక్.. 10వేల కంపెనీల ఫైళ్లు నిలిపివేత..!!







