కువైట్ లో 2వేల కంపెనీల లైసెన్స్ సస్పెండ్..!!
- October 23, 2026
కువైట్: నిర్ణీత ఫీజులు చెల్లించకపోవడంతో సుమారు 2,000 కంపెనీల లైసెన్సులను కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కంపెనీల వివరాల్లో మార్పులకు సంబంధించిన లావాదేవీల ఫీజులు పెండింగ్లో ఉండటంతో ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు పత్రికకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెండింగ్ ఫీజులు చెల్లించి, అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తి చేసే వరకు లైసెన్సులపై సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నాయి.
వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, వాణిజ్య రికార్డులను తనిఖీ చేయడం, కంపెనీలు అమల్లో ఉన్న నిబంధనలు, ప్రభుత్వ నిర్ణయాలను పాటించేలా చూడటం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల మధ్య ఎలక్ట్రానిక్ అనుసంధాన వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు, సంస్థల యజమానులు మంత్రిత్వ శాఖ ఆన్లైన్ సేవలను పరిశీలించి, పెండింగ్లో ఉన్న ఫీజులు, అవసరమైన పత్రాలకు సంబంధించిన ప్రక్రియలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. లేనిపక్షంలో లైసెన్సులు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- దక్షిణ భారతాన్ని అత్యంత సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దుదాం: సీఎం రేవంత్
- జనవరిలో ఖతార్ అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్..!!
- హౌతీల వాదనను ఖండించిన సౌదీ నేతృత్వంలోని కూటమి..!!
- కువైట్ లో 2వేల కంపెనీల లైసెన్స్ సస్పెండ్..!!
- యూఏఈలో ఐఫోన్ డ్యుయోకు భారీ డిమాండ్..!!
- ఒమన్ సముద్ర జలాల్లో పింక్ డాల్ఫిన్..!!
- అక్టోబర్ 31 వరకు సౌదీ అరేబియాకు ఇండిగో విమాన సర్వీసుల రద్దు
- మళ్లీ తెరపైకి పదేళ్ల నాటి ఫుట్ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన..!!
- దుబాయ్లో 27వ అంతర్ పాఠశాలల డిబేట్ కాంపిటీషన్ ఫైనల్
- భారతీయులకు, విదేశీయులకు వేర్వేరు రంగుల డ్రైవింగ్ లైసెన్స్..







