బంతిపూల జానకి రివ్యూ...
- August 26, 2016
చిత్రం పేరు: బంతిపూల జానకి
తారాగణం: ధన్‌రాజ్.. దీక్షాపంత్.. చమ్మక్‌చంద్ర.. సుడిగాలి సుధీర్.. రాకెట్ రాఘవ.. షకలక శంకర్.. భరత్‌రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం: జి.ఎల్.బాబు
సంగీతం: బోలే
కథ..
మాటలు: శేఖర్ విఖ్యాత్
నిర్మాతలు: కల్యాణి.. రామ్
దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్
సంస్థ: ఉజ్వల క్రియేషన్స్
విడుదల: 26-08-2016
హాస్యనటుడిగా తనకంటూ ఓ శైలిని ఏర్పాటు చేసుకొన్నాడు ధన్‌రాజ్. ఇటీవల కథానాయకుడిగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. 'జబర్దస్త్'తో ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యాడు. 'ఈటీవీ'లో ప్రసారమవుతున్న ఆ షోతో పలువురు హాస్యనటులు వెలుగులోకి వచ్చారు. వాళ్లతో కలిసి ధనరాజ్ నటించిన మరో చిత్రమే.. 'బంతిపూల జానకి'. సినిమా హీరోయిన్ అయిన జానకి కోసం జబర్దస్త్ బృందం ఏం చేసిందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: జాతీయ అవార్డు సొంతం చేసుకొన్న ఓ కథానాయిక జానకి (దీక్షాపంత్). తన మేనేజర్ శ్యామ్ (ధన్‌రాజ్)తో కలిసి ఓ అపార్ట్మెంట్లో ఉంటుంది. జానకికి జాతీయ పురస్కారం వచ్చిందని తెలియగానే ఆమెతో సినిమా చేసిన దర్శకుడు అహంకారం (చమ్మక్‌చంద్ర), హీరో ఆకాశ్ (సుడిగాలి సుధీర్), రచయిత మిరియాలు (రాకెట్ రాఘవ), నిర్మాత బంగారయ్య (అదుర్స్ రఘు) చాలా సంతోషిస్తారు. శుభాకాంక్షలు చెప్పేందుకు జానకి ఇంటికి వెళతారు. ఆ క్రమంలో ఆమె ఇంట్లోకి వెళ్లిన వాళ్లంతా ఒక్కొక్కరుగా శవాలై బయటికొస్తారు. ఎందుకలా? ఈ హత్యలకీ శ్యామ్కీ ఏమైనా సంబంధం ఉందా? లాంటి విషయాల్ని తెరపైన చూసే తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే?: కథగా చూస్తే ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ ఆ ఆసక్తిని తెర పైకి తీసుకురావడంలోనే దర్శకుడు విఫలమయ్యారు. దీంతో కథ ఎక్కడా ప్రేక్షకుల్ని రక్తి కట్టించదు. 'జబర్దస్త్' బృందం ఉంది కదా అని నవ్వులు ఆశించినా భంగపాటు తప్పదు. సినిమాలో సినిమా కథ చెప్పడం.. ఒక హీరోయిన్ ఇంట్లో హత్యలనే అంశం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ అలాంటి కథలు చెప్పాలంటే బలమైన కథనం కూడా అవసరమే. ఈ సినిమాలో లేనిదే అది.
సినిమా మొదలుపెట్టిన తీరు బాగానే ఉంటుంది. కానీ పాత్రలని పరిచయం చేయడానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకొన్నారు. కథ ఆసక్తికరంగా ఉన్నా.. దర్శకుడు పాత్రలపైనే ఆధారపడి.. వాటితోనే వినోదం పంచాలనే ప్రయత్నం చేసినట్టు స్పష్టమవుతుంది. పాత్రలకి తగ్గట్టుగా అటు నవ్వుల పైనా దృష్టి పెట్టని దర్శకుడు కథకు తగ్గట్టు ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నమూ చేయలేదు. దీంతో సినిమా రెంటికి చెడ్డ రేవడిలా మారింది.
ఎవరెలా చేశారంటే?: ధన్‌రాజ్.. దీక్షాపంత్‌లు వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. ధన్‌రాజ్ ఇదివరకటి సినిమాల్లోలా కాకుండా ఇందులో కూల్‌గా.. పాత్రకి తగ్గట్టుగానే కనిపించాడు. సుడిగాలి సుధీర్.. చమ్మక్ చంద్ర.. అదుర్స్ రఘు.. రాకెట్ రాఘవ తదితరులు గమ్మత్తైన పాత్రల్లో ఒదిగిపోయారు. కానీ వాటితో ప్రేక్షకుల్ని నవ్వించే ఆస్కారమే వారికి దొరకలేదు. శేఖర్ విఖ్యాత్ కథ ఓకే. మాటలపై మరికాస్త ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
+ దీక్షాపంత్.. ధన్‌రాజ్ నటన
+ సంగీతం
- కథనం
- దర్శకత్వం
చివరిగా.. 'బంతిపూల జానకి' పేరున్నంత అందంగా ఉండదు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









