షార్జాలో రోడ్డు మీద విడిచిపెట్టిన మగ శిశువుని రక్షించిన శస్త్రచికిత్స
- August 26, 2016
షార్జ: జన్మనిచ్చిన తల్లితండ్రులకు కనికరం లేకపోయినా...పసిబిడ్డ దైన్యస్థితికి జాలిపడ్డ వైద్యులు తమ శస్త్రచికిత్సతో ఆ పసికూనకు పునర్జన్మను ఇచ్చి వైద్యవృత్తికే వన్నె తెచ్చారా డాక్టర్లు.... పుట్టుకతోనే లోపం ఉన్న ఒక మగ శిశువుని దయలేని ఎవరో తల్లితండ్రులు షార్జా ప్రాంతంలో పబ్లిక్ రహదారిపై నిర్ధాక్షిణ్యంగా వదలివేసి వెళ్లిపోయారు. ఆ బాబుని అల్ ఖ్అసిమి హాస్పిటల్లో చేర్పించగా శస్త్రచికిత్స అనంతరం అక్కడ కోలుకొంటూ స్థిరమైన ఆరోగ్య స్థితిలో ఉన్నాడని ఆస్పత్రివర్గాలు పేర్కొంటున్నాయి .
ఈ నెల ఆగస్టు 10 వ తేదీన మూవెఇలాహ్ ప్రాంతంలో ఆ పసికందుని ఒక పబ్లిక్ రహదారిని పేవ్మెంట్ పక్కన వదిలివెళ్ళినట్లుగా కనుగొనబడింది. కడుపులోని ప్రేగులు తదితర అవయవాలు వెలుపల ఉన్న స్థితిలో పుట్టుకతోనే లోపంతో జన్మించిన ఈ శిశువుకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ప్రకటించారు. ఈ స్థితిలో దొరికిన ఈ శిశువుకు ఒక విజయవంతమైన ఒక శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం శిశువు యొక్క పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రిలో వైద్యులు పేర్కొన్నారు. ఆ బిడ్డ అనారోగ్యం కాస్త మెరుగుపడిన తరువాత షార్జాలోని పిల్లల రక్షణ కమిటీకి ఆ చిన్నారిని స్వాధీనం చేస్తామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







