ఆరు నెలల బ్రేక్..పామ్‌ జుమైరా లగ్జరీ హోటల్‌ రీ ఓపెన్..!!

- October 24, 2026 , by Maagulf
ఆరు నెలల బ్రేక్..పామ్‌ జుమైరా లగ్జరీ హోటల్‌ రీ ఓపెన్..!!

దుబాయ్‌: పామ్‌ జుమైరాలోని ప్రముఖ లగ్జరీ హోటల్‌ ది స్టెయిజ్‌ దుబాయ్‌, ది పామ్‌ (The St. Regis Dubai, The Palm) ఆరు నెలల పునరుద్ధరణ పనుల అనంతరం నవంబర్‌ 1న తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని స్టెయిజ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో భారీ పునరుద్ధరణ పనుల కోసం హోటల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఏప్రిల్‌ 12 నుంచి గెస్ట్ రూమ్స్, స్పా సహా పలు ప్రధాన సేవలను నిలిపివేసినట్లు అప్పట్లో హోటల్‌ నిర్వహణ వర్గాలు తెలిపాయి.

అయితే, లాబీ లాంజ్‌, స్టెయిజ్‌ బార్‌ మాత్రం కార్యకలాపాలను కొనసాగించాయి.ప్రాంతీయ ఘర్షణల కారణంగా వేసవిలో పర్యాటకుల రాక కొంత తగ్గిన నేపథ్యంలో, యూఏఈలోని హోటళ్లు తిరిగి సందర్శకుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్న సమయంలో ఈ హోటల్‌ పునఃప్రారంభం కానుంది. పునరుద్ధరణలో భాగంగా స్టెయిజ్‌ బార్‌కు సరికొత్త రూపాన్ని అందించారు. హోటల్‌ పునఃప్రారంభంలో ఈ బార్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. న్యూయార్క్‌లోని స్టెయిజ్‌ బ్రాండ్‌ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా మాన్‌హాటన్‌ నగర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ఫొటో ఫ్రేమ్‌లను ఏర్పాటు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com