సహమ్‌లో ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదం.. హెలికాప్టర్‌తో ఆసుపత్రికి తరలింపు..!!

- October 24, 2026 , by Maagulf
సహమ్‌లో ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదం.. హెలికాప్టర్‌తో ఆసుపత్రికి తరలింపు..!!

మస్కట్‌: ఒమన్‌లోని సహమ్‌ విలాయత్‌లో మౌంటెన్ పై ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడిన ఒమన్‌ పౌరుడిని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ (ROP) ఎయిర్‌ వింగ్‌ సిబ్బంది రక్షించారు. కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఎయిర్‌ వింగ్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం గాయపడిన వ్యక్తిని హెలికాప్టర్‌ ద్వారా సోహార్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి అవసరమైన వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com