ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- October 24, 2026
దోహా: ఖతార్‌లో ఈ-కామర్స్ రంగాన్ని ప్రోత్సహించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త లైసెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు జారీ చేసిన మినిస్టిరియల్ ఆర్డర్స్ నంబర్ (25) of 2026 ప్రకారం.. అనుమతి పొందిన నిర్దిష్ట వాణిజ్య కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చు. అయితే, వ్యాపారం స్వభావం, సంబంధిత నిబంధనలను బట్టి ఇంటి నుంచి, కార్యాలయం నుంచి లేదా ఇతర అనువైన ప్రదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రత్యేక వాణిజ్య ప్రాంగణంపై పూర్తిగా ఆధారపడకుండా అర్హులైన వ్యాపారులు డిజిటల్ విధానంలో తమ వ్యాపారాలను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు.
ఆన్‌లైన్ విక్రయాలు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు ఈ విధానం ఉపయోగకరంగా ఉండనుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినియోగదారులను చేరుకోవడం, ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడం, లావాదేవీలు నిర్వహించడం సులభతరం కానుంది. అయితే, ఈ లైసెన్స్ అన్ని వ్యాపారాలకు వర్తించదు. మంత్రిత్వ శాఖ అనుమతించిన కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తుందని, వ్యాపారులు సంబంధిత నిబంధనలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!
- యూఏఈలో ఉద్యోగ నియామకాల్లో మార్పులు..!!
- సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- డ్రెయిన్ క్లీనర్‌తో ఇద్దరికి తీవ్ర గాయాలు.. రెస్టారెంట్ యజమాని, ఇద్దరు ఉద్యోగులకు Dh50,000 జరిమానా
- యూరప్‌లో ఎండల బీభత్సం.. 50 వేల మంది మృతి!
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు







