కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- October 24, 2026
కువైట్: విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో తమిళనాడు ఇంజినీర్స్ ఫోరం (TEF) కువైట్ InnoEx-2026 నాలుగో ఎడిషన్ ఇంటర్ స్కూల్ సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమం నవంబర్ 6న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కువైట్‌లోని సల్వా రాడిసన్ బ్లూ హోటల్లో జరగనుంది.
ఇందులో వివిధ భారతీయ పాఠశాలల విద్యార్థులతో పాటు TEF కువైట్ కుటుంబాలకు చెందిన పిల్లలు పాల్గొననున్నారు. ఈ సైన్స్ ఫెయిర్‌లో రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్, సుడోకు, సైన్స్ క్విజ్, పోస్టర్ తయారీ, రోబోటిక్ ఫుట్‌బాల్, సైన్స్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్, వర్కింగ్ సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ శివసుబ్రమణియన్ పాల్గొననున్నారు.
విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. విద్యార్థులు, పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రవేశం ఉచితమని నిర్వాహకులు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఊరట..!!
- ఒమన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ.. వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్..!!
- కువైట్‌లో నవంబర్ 6న సైన్స్ ఫెయిర్..ఉచిత ప్రవేశం..!
- ఖతార్‌లో డిజిటల్ వ్యాపారులకు గుడ్ న్యూస్..!!
- గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!
- యూఏఈలో ఉద్యోగ నియామకాల్లో మార్పులు..!!
- సౌదీ అరేబియాపై కొనసాగుతున్న హౌతీల దాడులు..!!
- డ్రెయిన్ క్లీనర్‌తో ఇద్దరికి తీవ్ర గాయాలు.. రెస్టారెంట్ యజమాని, ఇద్దరు ఉద్యోగులకు Dh50,000 జరిమానా
- యూరప్‌లో ఎండల బీభత్సం.. 50 వేల మంది మృతి!
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీకి అరుదైన గుర్తింపు







