జిల్లాల మ్యాప్ లను తెలంగాణ విడుదల చేసింది
- August 26, 2016
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నకొత్త జిల్లాల మ్యాప్ లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరోవైపు జిల్లాల డ్రాప్ట్ పై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. కొత్త జిల్లాల మ్యాప్ ల పోర్టల్ http://newdistrictsformation.telangana.gov.in లో చూడవచ్చు.ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్ లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది. హైదరాబాద్ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. కాగా తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది. దసరా పండుగ రోజున తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావాన్ని చూడవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







