'జనతా గ్యారేజ్ ' సినిమాకు U/A సర్టిఫికెట్..
- August 26, 2016
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. ముమ్మూర్తులా తాత పోలికలు పోలి ఉన్న ఎన్టీఆర్ బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చారు..అంతే కాదు తాత మెచ్చిన మనవడు ఎన్టీఆర్. గత సంవత్సరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' మరో ఘన విజయం సాధించింది. ఇదే జోష్ పై ఎన్టీఆర్ శ్రీమంతుడు, మిర్చి లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రాలు అందించిన దర్శకులు కొరటాల దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.ఆ మద్య ఆడియో ఫంక్షన్ కూడా బాగానే సక్సెస్ అయ్యింది.ఇక టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్స్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. ఇక 'జనతా గ్యారేజ్' సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్లింది. మొదటి కాపీ చూసిన సెన్సార్ సభ్యులు సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కితాబు ఇస్తున్నారు.'జనతా గ్యారేజ్ ' సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ బ్లాక్స్ బస్టర్ కావడంలో ఎలాంటి డౌట్ లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ కెరీర్ లోనే ఈ సినిమా అధిక వసూళ్లు సాధిస్తుంది అనడం లో ఎలాంటి సందేహం అవసరం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









