తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో.. 24 గంటల బ్యాటరీ లైఫ్!
- October 29, 2026
లాస్ ఏంజెల్స్: ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లో కీలక మార్పు తీసుకొచ్చింది. దాదాపు రెండు దశాబ్దాలుగా టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉన్న ఆపిల్.. తొలిసారిగా టచ్‌స్క్రీన్ ఫీచర్‌తో కూడిన కొత్త మ్యాక్‌బుక్ ప్రోను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. వ్యక్తిగత కంప్యూటర్ల రంగంలో టచ్‌స్క్రీన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
తక్కువ బరువు..ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం
కొత్త మ్యాక్‌బుక్ ప్రో 14 అంగుళాలు, 16 అంగుళాల స్క్రీన్ పరిమాణాల్లో అందుబాటులోకి రానుంది. 14 అంగుళాల మోడల్ బరువు 3 పౌండ్లు ఉండగా, గత మోడల్‌తో పోలిస్తే అర పౌండు తక్కువ. ఇక 16 అంగుళాల మోడల్ బరువు 4 పౌండ్లుగా ఉంది. ఇది మునుపటి మోడల్ కంటే 0.7 పౌండ్లు తక్కువ కావడం విశేషం.
ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 24 గంటల వరకు పనిచేస్తుందని ఆపిల్ ప్రకటించింది. అంతేకాకుండా, మ్యాక్‌బుక్ వెనుక భాగంలో గతంలో కనిపించిన ప్రకాశించే ఆపిల్ లోగోను తిరిగి తీసుకొచ్చింది.
మ్యాక్‌బుక్‌లో టచ్‌స్క్రీన్‌కు శ్రీకారం
లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆపిల్ సీఈఓ జాన్ టెర్నస్ కొత్త మ్యాక్‌బుక్ ప్రోను పరిచయం చేశారు. “అవును.. తొలిసారిగా మ్యాక్‌లో టచ్‌స్క్రీన్ సదుపాయాన్ని అందిస్తున్నాం” అని ఆయన తెలిపారు.
కొత్త మ్యాక్‌బుక్ ప్రోలోని ProLED XDR డిస్‌ప్లే మ్యాక్ కంప్యూటర్ల రంగంలో కీలక ముందడుగు అని ఆపిల్ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ జానీ స్రౌజీ పేర్కొన్నారు.
టచ్‌స్క్రీన్‌తో పాటు తక్కువ బరువు, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం వంటి మార్పులతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించనుందని ఆపిల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కేదార్‌నాథ్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యాత్రికులకు కీలక సూచన
- అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా
- తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో.. 24 గంటల బ్యాటరీ లైఫ్!
- తుపాను బాధితులకు 25 కేజీల బియ్యం: సీఎం చంద్రబాబు
- తెలంగాణ సీఐడీలో కొత్త డిజిటల్ సేవలు ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
- అబుదాబిలో ప్లాస్టిక్ తయారీ సంస్థకు 15,000 దిర్హామ్‌ల జరిమానా
- ఇజ్రాయెల్ ఎన్నికల పై నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
- హైదరాబాద్ లో మెట్రో పాడ్ కార్ల డిపో!
- ఆన్లైన్లో పిల్లల రక్షణ అందరి బాధ్యత..!!
- బహ్రెయిన్‌లోని ఎంబసీని సందర్శించిన ఎంపీ రాజతి సల్మా..!!







