తుపాను బాధితులకు 25 కేజీల బియ్యం: సీఎం చంద్రబాబు
- October 29, 2026
అమరావతి: అర్నబ్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా 5 గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ షాక్ మరియు గోడ కూలిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకోవడానికి తక్షణ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
కోనసీమ, పశ్చిమ గోదావరిలో 30 వరకు విద్యుత్ కష్టాలు
కోనసీమ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో పరిస్థితులు పూర్తిగా అనుకూలించకపోవడంతో ఈ నెల 30 వ తేదీ సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం కష్టమని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన అన్ని ప్రభావిత జిల్లాల్లో బుధవారం రాత్రికల్లా విద్యుత్ సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుపాను నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ ద్వారా మాట్లాడి పూర్తి వివరాలు వివరించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా
- తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో.. 24 గంటల బ్యాటరీ లైఫ్!
- తుపాను బాధితులకు 25 కేజీల బియ్యం: సీఎం చంద్రబాబు
- తెలంగాణ సీఐడీలో కొత్త డిజిటల్ సేవలు ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
- అబుదాబిలో ప్లాస్టిక్ తయారీ సంస్థకు 15,000 దిర్హామ్‌ల జరిమానా
- ఇజ్రాయెల్ ఎన్నికల పై నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
- హైదరాబాద్ లో మెట్రో పాడ్ కార్ల డిపో!
- ఆన్లైన్లో పిల్లల రక్షణ అందరి బాధ్యత..!!
- బహ్రెయిన్‌లోని ఎంబసీని సందర్శించిన ఎంపీ రాజతి సల్మా..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపుపై సౌదీ, కువైట్ చర్చలు..!!







