అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా

- October 29, 2026 , by Maagulf
అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు వెళ్లే భక్తుల భద్రత కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాత్ర చేసే ప్రతి ఒక్కరూ ఈ సరికొత్త సదుపాయం గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం.

వర్చువల్ క్యూ బుకింగ్ లోనే నామినీ వివరాలు
అయ్యప్ప భక్తులు వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకునే సమయ నామినీ వివరాలను తప్పకుండా నమోదు చేయాలి. ఈ విధంగా వివరాలు ఇస్తేనే ప్రమాద బీమా వర్తిస్తుంది. భక్తులు బుకింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఈ చిన్న టెక్నిక్ ని అస్సలు మరువకూడదు.

ఏయే జిల్లాలలో ఈ బీమా వర్తిస్తుంది
పతనంతిట్ట, ఇడుక్కి, కొల్లం, అలప్పుజ జిల్లాల పరిధిలో జరిగే ప్రమాదాలకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ సహకారంతో ఈ అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్నారు. యాత్ర సమయంలో భక్తులకు ఇది ఎంతో పెద్ద భరోసా ఇస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com