60,000 డి హెచ్ విలువ చేసే వస్త్రాలను దొంగిలించిన ఇద్దరు సిబ్బందికి జైలు శిక్ష
- August 27, 2016
తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లుగా....ఒక వ్యాపార సంస్థలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తాము పనిచేసే చోటనే 60,000 డి హెచ్ విలువ చేసే మహిళల వస్త్రాలను దొంగిలించారు. ఈ కేసులో ఆ దొంగలకు ఆరు నెలల జైలుశిక్ష విధించబడింది.వీరు ఇరువురు భారతదేశానికి చెందినవారు కాగా ఒకరు సేల్స్ మాన్ ( 22 ) మరియు ఇంకొకరు ఒక గిడ్డంగి కాపలాదారుడు ( 26 ) ఈ తోడుదొంగలు 2014 నుండి జూలై 2015 మధ్య కాలంలో వివిధ సందర్భాలలో మరో ఇతర సహచరుల సహాయంతో పెద్ద వద్ద అంశాలను దొంగిలించారనే ఆరోపణలు ఉన్నాయి. 63 ఏళ్ల భారతీయుడైన కంపెనీ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుంచి ఈ తరహా దొంగతనాలు తన దుకాణంలో మరియు గ్రాండ్ సోయుక్యూ లో ఉన్న గిడ్డంగిలో తరచూ దొంగతనాలు జరుగుతున్నట్లు తనకు అనుమానం ఉందని అన్నారు. తనకు రెండవ ప్రతివాది గిడ్డంగి కాపలాదారుడి వ్యతిరేకంగా సందేహాలు ఉండేవని అతని వద్ద తాళాలు ఉన్నాయని తెలిపారు."జూలై 28 వ తేదీ 2015 న, తాను ఒమన్ లో ఉన్నప్పుడు ఈ దొంగతనం గురించి తెల్సుకొన్నట్లు యజమాని తెలిపాడు." తన దుకాణ మేనేజర్ తనని ఫోన్ లో పిలిచి రెండు పెట్టెల మహిళా దుస్తులు దొంగిలించబడినట్లు చెప్పారని తెలిపారు. ఈ ఆరోపణను గూర్చి తాను దుకాణానికి తిరిగి వచ్చినప్పుడు సిబ్బందితో సమావేశం నిర్వహించానని . "ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు 22 ఏళ్ళ సేల్స్ మాన్ మాత్రమే ఉన్నట్లు తేలిందని...అతన్ని గట్టిగా నిలదీయగా , తన నేరాన్ని చేయడంపై తన తప్పు ఒప్పుకున్నాడు. గిడ్డంగి కీపర్ సహాయంతో గతంలోను వివిధ వస్తువుల అపహరించినట్లు ఒప్పుకున్నాడు.ఈ ఇరువురు తాము పని చేస్తున్న దుకాణంలో దుస్తులు దొంగిలించి , అజ్మన్ లో ఉన్న వేరే ఒక బట్టల దుకాణం యజమానికి వాటిని విక్రయించేవాడినని అంగీకరించాడు. దీనితో ఇన్‌స్టాన్స్ తొలి న్యాయస్థానం వారికి 6 నెలల జైలు శిక్ష కాలం పూర్తయిన తర్వాత వారిని దేశ బహిష్కరణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







