గల్ఫ్ లో ఎక్కువ చోట్ల జనతా గ్యారేజ్ విడుదలవుతోంది!
- August 28, 2016
ఒకప్పుడు తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యేవి. మార్కెట్ కూడా తక్కువే. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల మార్కెట్ పెరిగి, ప్రపంచంలో చాలా దేశాల్లో విడుదలవుతున్నాయి. కానీ మిగతా దేశాల మాదిరిగా గల్ఫ్ లో ఎక్కువ చోట్ల తెలుగు సినిమాలు రిలీజ్ కావు. ఇప్పుడు సిట్యుయేషన్ లో మార్పు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా గల్ఫ్ లో ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఎక్కువ చోట్ల విడుదలవుతోంది.జూనియర్ ఎన్ టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. వీటికి తోడు ఇప్పుడొక కొత్త రికార్డును రిజిస్టర్ చేసుకోబోతోంది. గల్ఫ్ దేశాల్లో అత్యధికంగా 48 కి పైగా థియేటర్లలో జనతా గ్యారేజ్ చిత్రం రిలీజ్ అవుతోంది.ఇది నిజంగా సెన్సేషన్. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా గల్ఫ్ దేశాల్లో ఇన్ని చోట్ల స్క్రీనింగ్ కాలేదు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఆ రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ యాక్ట్ చేసిన టెంపర్ , నాన్నకు ప్రేమతో ...హిట్ కావడంతో ఈ చిత్రానికి చాలా క్రేజ్ వచ్చింది. దాంతో జనతా గ్యారేజ్ ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుండగా దానికి ఒకరోజు ముందుగానే గల్ఫ్ దేశాల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటించగా కాజల్ అగర్వాల్ ఓ ఐటెం సాంగ్ చేసింది.జనతా గ్యారేజ్ కథ కొంత సస్పెన్స్, యాక్షన్, కొంత ఫ్యామిలీ డ్రామాతో సాగుతుంది. ముంబై యునివర్సిటీ లో ఎన్టీఆర్, సమంత , నిత్యా మీనన్ , నిత్యా అన్నయ్య చదువుతుంటారు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతుంటాడు అయితే పేరుకి బయటకి కనిపించేది గ్యారేజ్ కానీ లోపల మరో రహస్యం ఉంటుంది. ఆ సీక్రెట్ చుట్టూనే కథ రన్ అవుతుందట. సినిమా చూస్తే కానీ అదేంటో తెలీదు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







