యూత్‌ఫుల్‌గా `బలపం పట్టి భామ ఒడిలో`
- August 28, 2016
రష్మీగౌతమ్, శాంతన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో `బలపం పట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాదమైంది. `అ ఆ ఇ ఈ` అనేది ఉపశీర్షిక. దుర్గం గిరీష్ బాబు సమర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ గజగౌని నిర్మాత. ఎ.సి.ముగిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ``కథ చాలా యూత్‌ఫుల్‌గా సాగుతుంది. యువతకు నచ్చేలా భారతీబాబు మంచి డైలాగులు రాశారు. రష్మీ గౌతమ్‌కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. అనువాద పనులు పూర్తయ్యాయి. విజయ్ ఎబింజర్ సంగీతం ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఎబింజర్, రచన: భారతీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కరణ మల్తుమ్‌కర్, సహ నిర్మాత: కె.మాధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.నాగరాజ్ గైడ్, రమేష్ కైగూరి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







