ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- November 14, 2026
ఇస్తాంబుల్: ఖతార్, టర్కియే దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ, టర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లు సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్చే ప్యాలెస్‌లో ఇరు దేశాధినేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం వినియోగదారుల రక్షణ, మార్కెట్ పర్యవేక్షణ, విద్య, శాంతి స్థాపన, సయోధ్య, సంఘర్షణల పరిష్కారం వంటి అంశాలకు సంబంధించిన పలు ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను కూడా పరస్పరం మార్చుకున్నారు.
అలాగే ఖతార్-టర్కియే సుప్రీం స్ట్రాటజిక్ కమిటీ 12వ సమావేశానికి సంబంధించిన సంయుక్త ప్రకటనను కూడా ఇరు దేశాల ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్‌థానీ, ఉప ప్రధానమంత్రి, రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్‌థానీ, అమిరి దివాన్ చీఫ్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ ఖులైఫీ, ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి షేక్ ఫైసల్ బిన్ థానీ అల్‌థానీ తదితరులు పాల్గొన్నారు.
టర్కియే తరఫున విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, ఆర్థిక మంత్రి మెహ్మెట్ సిమ్సెక్, రక్షణ మంత్రి యాసర్ గులెర్, పరిశ్రమలు, సాంకేతిక శాఖ మంత్రి మెహ్మెట్ ఫాతిహ్ కాజిర్, వాణిజ్య మంత్రి ఒమర్ బోలాట్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఒప్పందంతో ఖతార్, టర్కియే మధ్య రక్షణ, సైనిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!
- కువైట్‌లో వ్యవసాయ ఉత్పత్తి 12.65 శాతం తగ్గుదల..!!
- ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..
- కొత్తగూడెం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ !







