మతపరమైన వ్యవహారాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై యూఏఈ – ఒమన్ చర్చలు
- November 17, 2026
మస్కట్: మతపరమైన వ్యవహారాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, అనుభవాలు, విజయవంతమైన విధానాలను పరస్పరం పంచుకోవడంపై యూఏఈ, ఒమన్ దేశాలు చర్చించాయి.
యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, ఎండోమెంట్స్ అండ్ జకాత్ ఛైర్మన్ డాక్టర్ ఒమర్ హబ్తూర్ అల్ దరై, ఒమన్ మతపరమైన వ్యవహారాలు, ఎండోమెంట్స్ శాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ బిన్ సయీద్ అల్ మామారీతో మస్కట్‌లో సమావేశమయ్యారు.
మస్కట్‌లో సోమవారం నిర్వహించిన 'మస్కట్ ప్లాన్ గ్లోబల్ ఫోరం' సందర్భంగా ఈ భేటీ జరిగింది. 'అంతర్జాతీయ కట్టుబాట్ల నుంచి స్థానిక స్థాయి ప్రభావం వరకు: నివారణ, శాంతి నిర్మాణం' అనే ఇతివృత్తంతో ఈ ఫోరమ్ నిర్వహించారు. ఇందులో యూఏఈ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సోదరభావ సంబంధాలను ఒమన్ మంత్రి ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, సహనం, మానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించడంలో యూఏఈ చేస్తున్న కృషిని అభినందించారు.
అనంతరం మతపరమైన రంగంలో సహకారాన్ని విస్తరించడం, నైపుణ్యాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం, ఉమ్మడి లక్ష్యాల సాధనకు కృషి చేయడంపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వినూత్న సేవలను అభివృద్ధి చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు
- మతపరమైన వ్యవహారాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై యూఏఈ – ఒమన్ చర్చలు
- భారత్–ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- డీఎస్పీలు, అదనపు ఎస్పీల పదోన్నతుల సమస్యకు తెర..డీజీపీ ఆనంద్ చొరవతో పరిష్కారం
- ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్..
- యూఏఈ నేషనల్ డేకి దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- సౌదీ అరేబియాలో పేపర్ మిడిల్ ఈస్ట్ ఎగ్జిబిషన్..భారత పెవిలియన్‌ను ప్రారంభించిన కాన్సుల్ జనరల్
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ‘టుగెదర్ రీలోడెడ్’ సంగీత విభావరి
- అబుదాబి హోటల్లో ఘర్షణ కేసు.. 8 మంది నిందితులకు ఊరట..!!
- సౌదీలో కార్మికులను ఇతరులకు అప్పగిస్తే.. యజమానులకు 6 నెలల జైలు..!!







