మానవత్వం చూపించిన బహ్రెయిన్ ప్రధాని
- August 29, 2016
భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోమీటర్లు నడిచిన భర్త ఘటన యావత్ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి అద్దం పట్టిన ఆ ఘటన చూసి బహ్రెయిన్ ప్రధాని సైతం చలించిపోయారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
మీడియాలో ప్రసారమైన ఆ ఘటన చూసి బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రధాని ఖలీఫా ప్రకటించినట్లు బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ తెలిపింది. అయితే ఎంత సాయం అందిస్తారు, ఎప్పుడిస్తారన్న దానిపై తమకింకా సమాచారం రాలేదని పేర్కొంది.ఆ మొత్తాన్ని దిల్లీలోని బహ్రెయిన్ ఎంబసీ ద్వారా అందిస్తారు.
అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన దన మాంజీ.. తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు కాలినడకన తీసుకెళ్లిన వార్త, ఫొటోలను చూసి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







