నాగ్ స్టాంప్ విడుదల
- August 29, 2016
అక్కినేని నాగార్జున పుట్టినరోజున ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. నాగార్జున, తాజ్‌మహల్ బొమ్మలతో ఉన్న ఐదు రూపాయల ప్రైవేటు పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మలా కాన్వెంట్ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. నాగచైతన్య ఈ స్టాంపును అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావుకు అందించారు. అఖిల్ అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రవీంద్రరెడ్డికి అందించారు. మొత్తం 10 వేల స్టాంపులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. 'నా వయసులో నేనేం చేయాలో అవన్నీ ఈ వయసులో నాన్న చేసి చూపిస్తున్నారు. గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, సోగ్గాడే చిన్నినాయనా ఇలా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. ఆయన మాకు ప్రేరణగా నిలుస్తున్నారు' అన్నారు.
అనంతరం అఖిల్ మాట్లాడారు. 'నాన్న మాకెప్పుడూ ఆదర్శమే. మేము ఆయన బాటలో నడిచి, అభిమానుల ఆదరణ పొందాలి' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







