సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- November 25, 2026
రియాద్: సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ మరో కీలక డిజిటల్ నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి సంబంధించిన ఐదు సేవలను జాతీయ ప్రభుత్వ యాప్ ‘తవక్కల్నా’ (Tawakkalna) ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు, పర్యాటక రంగానికి చెందిన వారికి సేవలు మరింత సులభంగా అందించడంతో పాటు ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
తవక్కల్నా యాప్‌లో అందుబాటులోకి వచ్చిన ఐదు సేవలు ఇవే..
* టూర్ గైడ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం.
* పర్యాటక మంత్రిత్వ శాఖకు సంబంధించిన లైసెన్సులు, దరఖాస్తుల వివరాలు పొందడం.
* టూర్ గైడింగ్ శిక్షణకు సంబంధించిన సేవలు.
* శిక్షణ దరఖాస్తులు, మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లను పరిశీలించడం.
* పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందిన వ్యక్తులు, సంస్థల జాబితాను తనిఖీ చేయడం.
ఈ సేవలను ఇప్పటికే పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘టూరిజం ప్లాట్‌ఫామ్’తో అనుసంధానించారు. లబ్ధిదారులు తవక్కల్నా యాప్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే, వాటిని మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ వ్యవస్థల ద్వారా ప్రాసెస్ చేస్తారు. దీంతో వివిధ ప్రభుత్వ డిజిటల్ వేదికల మధ్య సేవల అనుసంధానం మెరుగుపడనుంది. డిజిటల్ గవర్నమెంట్ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సేవలను విస్తరిస్తున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిజిటల్ గవర్నమెంట్ అథారిటీతో కొనసాగుతున్న సహకారంలో భాగంగానే ఈ ఐదు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించడం, ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థంగా అందించడం ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమవుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!







