సోమాలియా దేశాధ్యక్షుడి నివాసం బయట బాంబు పేలుడు
- August 30, 2016
సోమాలియా దేశాధ్యక్షుడి నివాసానికి సమీపంలోనే కారు బాంబు పేలింది. రాజధాని మోగదీషు నగరంలో అధ్యక్షుడి ప్యాలెస్ బయట బాంబు పేలడంతో అక్కడి హోటల్స్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దుండగుడు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసు అధికారి మేజర్ మహ్మద్ అలీ వెల్లడించారు. అధ్యక్షుడు హసన్ షేక్ నివాసానికి ఎదురుగా ఉన్న రెండు హోటల్స్ దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. బాంబు పేలిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు.అలాగే హోటల్ వద్ద అల్‌షబాబ్ గ్రూప్ మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం.
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు అనుబంధ గ్రూప్ అయిన అల్-షబాబ్‌కు చెందిన మిలిటెంట్లు ఇటీవల మోగదీషుపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మోగదీషులోని రెస్టారెంట్‌పై జరిగిన దాడిలో 9 మంది మరణించారు. మంగళవారం ఏకంగా అధ్యక్ష నివాసం వద్దే దాడి చేశారు.
పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







