దాల్చిన చెక్కతో అధిక కొలెస్ట్రాల్ కు చెక్...
- August 30, 2016
మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరి నుదురుకు పట్టులాగా వేస్తే జలుబువల్ల వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది. దాల్చిన చెక్క నూనె చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందని, అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునేముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతుంటారు.
మాంసాహార, శాకాహార వంటకాల్లో సువాసన కోసం వాడే "దాల్చిన చెక్క" మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. గుండె పట్టేసినట్లుగా అనిపిస్తుంటే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్ళలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు.
కాస్తంత తేనెను వేడిచేసి అందులో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజుకు 3 పూటలా తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసినా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులను అరికట్టవచ్చు. బియ్యం కడిగిన నీటిలో మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి కూడా కాపాడవచ్చు.
పది గ్రాముల దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే విపరీతమైన కడుపునొప్పితో బాధపడేవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల దాల్చిన చెక్క పొడిని పావు లీటర్ వేడి నీటిలో రెండు గంటలపాటు ఉంచి ఆపై దాన్ని వడగట్టి సగ భాగం చొప్పున రోజుకు రెండుసార్లు సేవిస్తే నీళ్ల విరేచనాలను అరికట్టవచ్చు. మొటిమలతో బాధపడేవారు దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి రాసుకుంటే తగ్గుముఖం పడతాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







