ఒమన్‌లో 12 టన్నుల మెడికల్ వేస్ట్
- August 30, 2016
ఒమన్ ప్రతిరోజూ 12 టన్నుల మెడికల్ వేస్ట్‌ని జనరేట్ చేస్తోందని అవెర్దా అనే సంస్థ వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలో అభివృద్ధి ఆహ్వానించదగ్గదే అయినా, ఆసుపత్రులు మెడికల్ వేస్ట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుండడం ఆందోళన కరమని అవెర్దా వెల్లడించింది. ఒమన్‌లో మెడికల్ వేస్ట్‌ని ట్రీట్ చేస్తున్న సంస్థ అవెర్దా మాత్రమే. అమెరాత్, లివాలో రెండు చోట్ల మెడికల్ వేస్ట్‌ని ట్రీటింగ్ చేస్తోంది ఈ సంస్థ. ఒక నెలలో 360 టన్నుల మెడికల్ వేస్ట్ జనరేట్ అవుతుందని అవెర్దా సంస్థ వెల్లడించింది. బాడీ ఫ్లూయిడ్స్, రక్తం, రక్తానికి సంబంధించిన ప్రోడక్ట్స్, రసాయనాలు, వాడేసిన కేథరెట్స్, గ్లోవ్స్, నీడిల్స్, సోయిల్డ్ డ్రెస్సింగ్స్, మెడికల్ డివైసెస్ (వైరస్, బ్యాక్టీరియా కలిగి ఉన్నవి) వంటివి మెడికల్ వేస్ట్‌లో ఎక్కువగా ఉంటాయి. ఈ వేస్ట్ మొత్తాన్ని 800 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతలో కాల్చివేస్తారు. మొత్తం 40 వాహనాల్లో 120 మందితో మెడికల్ వేస్ట్‌ని వివిధ ఆసుపత్రులు, క్లినిక్‌ల నుంచి తరలిస్తుంటారు. వేస్ట్ ట్రీటింగ్ కారణంగా ఎలాంటి కాలుష్యం లేకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాల మధ్య నిర్వహణ జరుగుతుందని అవెర్దా సంస్థ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







