'అపార్ట్‌మెంట్' ఆడియో విడుదల
- August 30, 2016
నిఖిత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'అపార్టుమెంట్'. శ్రీ క్రియేటివ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. శివగంగరాజు వుడిమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.కె. శ్రీకాంత్ అంగళ్ళ నిర్మిస్తున్నారు. ఖుద్దూస్ ఎస్.ఎ. సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోను ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ''పాటలు విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి పేరు రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఖుద్ధూస్ గురించి నాకు బాగా తెలుసు. బాగా కష్టపడతాడు. ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.
ఒక అపార్ట్‌మెంట్ కల్చర్‌లోకి ఎంటరైన ఒక అమ్మాయికి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే ఈ సినిమా కథ అని దర్శకుడు శివగంగరాజు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా : సాబూ జేమ్స్, ఎడిటర్ : నాగిరెడ్డి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







