బాహుబలి-2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి
- August 30, 2016
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మంగళవారంతో బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయినట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేటితో క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.
భారీ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకోనుంది. తిరిగి సెప్టెంబరు 6 వ తేదీన కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది తెలియాలంటే 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల కావాల్సిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







