'బాతు కేవ్స్' కు ఉగ్ర ముప్పు
- August 31, 2016
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని బాతు కేవ్స్ పేరు చెప్పగానే అక్కడి ప్రఖ్యాత హిందూ దేవాలయమైన కుమారస్వామి (మురుగన్) ఆలయం గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన 'బిల్లా'లో కీలక పాత్ర పోషించిన కృష్ణంరాజు ఈ ఆలయాన్ని సందర్శించిన ఘట్టం కూడా సినిమాలో ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల వారు కూడా మలేషియాలో జరిపే ప్రతీ సినిమా షూటంగ్‌లో ఈ ఆలయం తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఆలయంతో పాటు దేశంలోని పలు ఎంటర్‌టైన్‌మెంట్ పరికరాల విక్రయ సంస్థలు, పోలీసు స్టేషన్లపై దాడులకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను అత్యంత చాకచక్యంగా మలేషియా పోలీసులు భగ్నం చేశారు. పేల్చిపేతలకు కుట్రపన్నిన ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను మలేసియాలో అరెస్టు చేశారు.
బుధవారంనాడు మలేసియా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో దాడులకు తెగబడేందుకు ఉగ్రవాదులు వ్యూహరచన చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేయనున్న నేపథ్యంలో ఈ దాడులు చేయాలని ఐసిస్ కుట్ర చేసినట్లు మలేసియా పోలీసులు గుర్తించారు. దీంతో ఉగ్రవాద నిరోధక ప్రత్యేక శాఖ పోలీసులు రంగంలోకి దిగి ఈనెల 27, 29 తేదీల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి ఇంటరాగేషన్‌లో ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఖలిద్ అబు బకర్ వెల్లడించారు.
దాడికి కుట్ర చేసిన ముగ్గురు 20 నుంచి 30 ఏళ్లలోపు మధ్యవారే. మొదటి అనుమానితుడిని సెలంగూర్‌లో అదుపులోనికి తీసుకుని అతని వద్ద నుంచి గ్రనేడ్, పిస్తోల్, 9 ఎంఎం బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కిన ఇద్దరినీ పహాంగ్‌లో అరెస్టు చేశారు. ఈ దాడుల ఆపరేషన్ సమర్థంగా పూర్తి చేసిన వెంటనే సిరియాకు వెళ్లిపోవాలని వారు ప్రణాళికలు రచించుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
కుట్రదారుల నుంచి గ్రనేడ్లు, తుపాకులు, 24 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు లారీ డ్రైవర్ కాగా, మరొకరు కసాయి పని, మూడో వ్యక్తి పానీయాల విక్రేతగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







